యెస్ బ్యాంకుకు పెట్టుబడుల భరోసా!

by  |
యెస్ బ్యాంకుకు పెట్టుబడుల భరోసా!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్గత సంక్షోభంతో విలవిల్లాడుతున్న యెస్ బ్యాంకులోకి పెట్టుబడుల వెల్లువ మొదలైంది. యెస్ బ్యాంకును ఆదుకుంటామని ఇప్పటికే కొన్ని బ్యాంకులు రాగా, మరో ప్రైవేట్ బ్యాంకు బంధన్ బ్యాంకు రూ. 300 కోట్ల పెట్టుబడికి పచ్చ జెండా ఊపింది. ఈ అంశంపై బంధన్ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. యెస్ బ్యాంకు రూ. 10 చొప్పున 30 కోట్ల ఈక్విటీ షేర్లను కొంటున్నట్టు, వాటి విలువ రూ. 300 కోట్లను పేర్కొన్నారు. ఈ షేర్ల కొనుగోలును నగదు రూపంలో లావాదేవీ నిర్వహించనున్నట్టు తెలిపారు. యెస్ బ్యాంకులో ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రూ. 7,250 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. దీంతో పాటు ఐసిఐసిఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు చెరో బ్యాంకు రూ. 1000 కొట్ల చొప్పున పెట్టుబడికి తలూపాయి. యాక్సిస్ బ్యాంకు రూ. 600 కోట్లు, కోటక్ బ్యాంకు రూ. 500 కోట్లు యెస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టనున్నట్టు స్పష్టం చేశాయి. అన్ని బ్యాంకుల పెట్టుబడులు కలిపి ఇప్పటికే యెస్ బ్యాంకులో 70 శాతం వాటాను ఈ ఐదు సంస్థదే ఉంది. షేర్లను జారీ చేయడం, పునరుద్ధరణ ప్రణాళిక తర్వాత వాటాలపై స్పష్టత రానుంది.

ఇక ఆర్‌బీఐ విధించిన మారటోరియం మార్చి 18న ఎత్తివేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రకటన ప్రకారం ఆర్‌బీఐ ప్రతిపాదించిన ‘యెస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళిక-2020’ అమలు జరిగినట్లు అయింది.

tags : Yes Bank crisis, Yes Bank, Bandhan Bank



Next Story

Most Viewed