- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండారు దత్తాత్రేయకు తప్పిన పెను ప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లింది. కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో దత్తాత్రేయ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం దత్తాత్రేయ మరో వాహనంలో నల్గొండకు బయల్దేరారు. తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు నల్గొండకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లింది. కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో దత్తాత్రేయ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం దత్తాత్రేయ మరో వాహనంలో నల్గొండకు బయల్దేరారు. తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు నల్గొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో కింద ఉంది చూడవచ్చు.
Next Story






