కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ఆస్తి విలువ ఎంతో తెలుసా..!

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరుగుతున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట నర్సింగరావు ఆస్తుల అఫిడవిట్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసిన వివరాల ప్రకారం అతనితో పాటు కుటుంబ సభ్యుల పేర రూ. 3,76,93,597.05 విలువ గల స్థిర, చరాస్థులు, అలాగే రూ.1,45,00,242 అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివిధ రకాల ఆందోళనలు చేపట్టిన సందర్భాల్లో 8 కేసులు కూడా నమోదయ్యాయి. అవి [&hellip;]</p>

NSUI, NSUI state president, Balmuri Venkat, Huzurabad Congress candidate, huzurabad by elections, revanth reddy
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరుగుతున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట నర్సింగరావు ఆస్తుల అఫిడవిట్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసిన వివరాల ప్రకారం అతనితో పాటు కుటుంబ సభ్యుల పేర రూ. 3,76,93,597.05 విలువ గల స్థిర, చరాస్థులు, అలాగే రూ.1,45,00,242 అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివిధ రకాల ఆందోళనలు చేపట్టిన సందర్భాల్లో 8 కేసులు కూడా నమోదయ్యాయి. అవి వివిధ దశల్లో విచారణలో ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు.

వెంకట్ వద్ద రూ. 48,525 నగదు, రూ.44,51,086.56 చరాస్తి ఉండగా, ఇందులో రూ.22,19,448 విలువ గల 46.2 తులాల బంగారు ఆభరణాలు, రూ.14.50 లక్షల విలువ గల ఒక టాటా సఫారీ వాహనం ఉందని, రూ. 15 లక్షల విలువ గల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కోటి నలభై ఐదు లక్షల రెండు వందల నలబై మూడు రూపాయల అప్పు ఉన్నట్లు తెలిపాడు. అలాగే, తల్లి బల్మూరి పద్మ పేర రూ.28,93,310.49 చరాస్థులు చూపగా, రూ.95,300 నగదు, రూ.14,81,726 విలువ చేసే 30.85 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని, రూ.2 కోట్ల70 లక్షల 49 వేల 200 విలువ చేసే స్థిరాస్తి, కోటి ముప్పై ఒక లక్షల తొంభై ఐదు వేల నలభై తొమ్మిది రూపాయల అప్పు ఉన్నట్లు వెల్లడించారు.

Next Story