- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవీకాలం ముగియడంతో శాసనమండలిలో సీనియర్ సభ్యులు, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యంను ప్రొటెం చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్ బీబీ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి కొత్త చైర్మన్ ఎన్నిక అయ్యే వరకు విఠపు బాల సుబ్రహ్మణ్యం ఈ పదవిలో కొనసాగుతారు. బాల సుబ్రహ్మణ్యం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మిక ప్రజా సంఘాల మద్దతుతో మూడుసార్లు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవీకాలం ముగియడంతో శాసనమండలిలో సీనియర్ సభ్యులు, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యంను ప్రొటెం చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్ బీబీ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.
శుక్రవారం నుంచి కొత్త చైర్మన్ ఎన్నిక అయ్యే వరకు విఠపు బాల సుబ్రహ్మణ్యం ఈ పదవిలో కొనసాగుతారు. బాల సుబ్రహ్మణ్యం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మిక ప్రజా సంఘాల మద్దతుతో మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారు. పలు రాష్ట్రాలకు సలహాదారుగా పనిచేసిన ఆయన విద్యారంగంలో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసి ప్రత్యామ్నాయ విధానాలు సూచిస్తుంటారు.
Next Story






