- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాణ పనులు నవంబర్ నాటికి పూర్తి: తలసాని
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నవంబర్‌లో పూర్తవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణాలను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.68.67కోట్ల వ్యయంతో 1.13 కిలోమీటర్ల బాలానగర్ ఫ్లై ఓవర్‌ను 6 లైన్లుగా చేపడుతన్నామని […]</p>

X
దిశ, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నవంబర్‌లో పూర్తవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణాలను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.68.67కోట్ల వ్యయంతో 1.13 కిలోమీటర్ల బాలానగర్ ఫ్లై ఓవర్‌ను 6 లైన్లుగా చేపడుతన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవి కిరణ్, ప్రశాంతి, హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ ప్రేమ్ జ్యోతి, ఈఈ హుస్సేన్, డీఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు
Next Story






