భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన బాలయ్య

by  |
భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన బాలయ్య
X

దిశ, వెబ్ డెస్క్: నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని కించపరుస్తూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో బాలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరమని, సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదిక అయిందన్నారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టడం ఎప్పుడూ చూడలేదని, అసెంబ్లీలో వ్యక్తిత్వాలను కించపరిచేలా ప్రవర్తించారన్నారు. వైసీపీ వ్యక్తిత్వ హనానికి పాల్పడిందన్నారు.

‘ఇకపై నోరు జారితే ఎవరినీ ఉపేక్షించం.. ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదు.. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం.. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు.. ఖబడ్డార్.. నోరు అదుపులో పెట్టుకోండి’ అని బాలయ్య వార్నింగ్ ఇచ్చారు.



Next Story

Most Viewed