బాలయ్య@106 షూటింగ్ ప్రారంభం

by  |
బాలయ్య@106 షూటింగ్ ప్రారంభం
X

నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాతో ‘సింహ’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ మరో సారి రిపీట్ కాబోతోంది. బాలకృష్ణకు ఇది 106వ సినిమా కాగా… ఇందులో రెండు పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కోసం ఆయన 25 కేజీల బరువు కూడా తగ్గారట. బాలయ్య ఒక పాత్రలో అఘోరగా కనిపించనుండగా… వారణాసిలో షూటింగ్ ప్రారంభమైంది. బోయపాటి భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. కాగా సినిమాలో కమెడియన్ సునీల్… మరోసారి విలన్‌గా కనిపించనున్నారు. ఇంతకు ముందు ‘డిస్కో రాజా’లో నెగెటివ్ రోల్‌ చేసిన సునీల్ ‘కలర్ ఫోటో’ చిత్రంలోనూ విలనిజాన్ని ప్రదర్శించనున్నాడు. కాగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తుండగా… బాలయ్యకు జంటగా హీరోయిన్ అంజలి నటిస్తోంది.

Tags : Balakrishna, Boyapati, NBK106, Dwaraka Creations, Anjali

Next Story

Most Viewed