రాజమౌళిని పొడిచి చంపిన బాలకృష్ణ.. కారణం అదే..

by  |
balakrishna
X

దిశ, కుత్బుల్లాపూర్ : పంచాయతీ పెద్దగా వెళ్లిన వ్యక్తి అల్లుడు చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పరిధి సంజయ్ గాంధీనగర్‌కు చెందిన రాజమౌళి(50) ప్రైవేట్ ఉద్యోగి. అయితే సమీపంలోని పాపిరెడ్డి నగర్‌లో ఉండే అల్లుడు బాలకృష్ణ తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై రాజమౌళి మంగళవారం రాత్రి అల్లుడు ఇంటికి పంచాయతీ పెద్దగా వెళ్లి మాట్లాడుతున్నారు.

తండ్రి విషయంలో మామా, అల్లుళ్లకు మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. కోపోద్రిక్తుడైన బాలకృష్ణ ఇంట్లో ఉన్న కత్తితో మామ రాజమౌళి మెడపై పొడిచాడు. వెంటనే కుటుంబ సభ్యులు చింతల్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా బుధవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.


Next Story

Most Viewed