నియోజకవర్గ ప్రజలకు బాలయ్య కరోనా మెడికల్ కిట్స్

148
NBK, Corona Medical Kits

దిశ, సినిమా: నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం కొవిడ్ బాధితుల కోసం రూ.20లక్షల విలువైన మందులను సమకూర్చారు. తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి హిందూపురానికి కరోనా మెడికల్ కిట్స్ పంపించారు. కాగా హిందూపురంలోని తన నివాసం వద్ద టీడీపీ నాయకులు కొవిడ్ బాధితుల బంధువులకు ఈ కిట్స్ పంపిణీ చేశారు. ఎన్‌బీకే సేవా సమితి వారి సౌజన్యంతో 20వేల కిట్లు పంపించినట్లు తెలిపారు. ఒక్కో కిట్ విలువ రూ. 1100 ఉంటుందని చెప్పారు. ఐదు రోజుల క్రితం ఆల్రెడీ 1500 కిట్లను పంపిణీ చేసినట్లు వివరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..