బాలకృష్ణ – బోయపాటి మాసివ్ కాంబినేషన్ మూవీ అప్‌డేట్

by  |
బాలకృష్ణ – బోయపాటి మాసివ్ కాంబినేషన్ మూవీ అప్‌డేట్
X

దిశ, సినిమా: మాసివ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను మూవీ అప్‌డేట్ వచ్చేసింది. ‘సింహ’ ‘లెజెండ్’ సినిమాల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. #BB3(వర్కింగ్ టైటిల్) చిత్రం మే 28న థియేటర్లలో గర్జించేందుకు వచ్చేస్తుందని ప్రకటించారు మేకర్స్. ద్వారకా క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తైంది.

వచ్చే నెల మొదటి వారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుండగా..కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు బోయపాటి. బాలకృష్ణతో బోయపాటి చేసిన రెండు సినిమాల్లోనూ యాక్షన్ ఓ రేంజ్‌లో ఉండగా..రాబోయే సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు బాలయ్య. దీంతో అభిమానులు హై ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్నారు. కాగా, బాలకృష్ణ 106వ చిత్రంగా వస్తున్న సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, సయేషా సైగల్ హీరోయిన్లు. త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్ చేయనుంది మూవీ యూనిట్.

https://twitter.com/dwarakacreation/status/1355819687150374914?s=20


Next Story