తారక్ డైలాగే.. బాలయ్య టైటిల్?

by  |
తారక్ డైలాగే.. బాలయ్య టైటిల్?
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులు ‘యాక్షన్ స్టోరీ’ అని ఫిక్స్ అయిపోతారు. బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోతాయని మార్క్ వేసేసింది ఈ కాంబినేషన్. ఇప్పుడు కూడా అంతే.. పవర్‌ఫుల్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు రాగా.. ఇప్పుడు మరో పేరు తెరమీదకి వచ్చింది.

తారక్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాలోని ‘టార్చ్ బేరర్’ అనే డైలాగ్‌ను బాలయ్య మూవీ టైటిల్‌గా ఫిక్స్ చేస్తారని సమాచారం. ఈ పదం సినిమా కథకు చక్కగా సరిపోతుందని మూవీ యూనిట్ ఇలా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా బాలయ్య డబుల్ రోల్‌లో కనిపించబోతున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తుండగా.. మరో ఫిమేల్ లీడ్ రోల్‌‌లో స్నేహ లేదా భూమిక నటిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక బాలయ్య హీరోయిజానికి దీటుగా నిలిచేలా బాలీవుడ్ హీరోనే విలన్‌గా తీసుకుంటారని సమాచారం.

Next Story

Most Viewed