సరికొత్త 'డోమినార్ 400' బైక్‌ను విడుదల చేసిన బజాజ్ ఆటో!

by  |
Dominar Bike
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన సరికొత్త స్పోర్ట్స్‌బైక్ బజాజ్ ‘డోమినార్ 400’ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రూ. 2.16 లక్షల(ఎక్స్‌షోరూమ్) ధరతో ఈ మోటార్‌సైకిల్ లభిస్తుందని, బీఎస్-6 ప్రమాణాలతో దీన్ని దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ బైక్ డిజైన్‌లో మార్పులను చేయడంతో పాటు అత్యాధునిక ఫీచర్లను ఇందులో అందించామని కంపెనీ పేర్కొంది.

అరోరా గ్రీన్, చార్‌కోల్ బ్లాక్ రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంది. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ యాక్సెసరీస్‌తో మెరుగైన టూర్ రైడింగ్ అనుభూతిని అందించేందుకే ఈ బైక్ డిజైన్‌లో మార్పులు చేసినట్టు బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ నారాయణ్ సుందరరామన్ చెప్పారు. దేశీయ మార్కెట్లో డోమినార్ బ్రాండ్ వినియోగదారుల నుంచి ప్రత్యేకమైన ఆదరణను కలిగి ఉంది. సుధీర్ఘ దూరం ప్రయాణించాలనుకునే వారికి ప్రత్యేక అనుభూతిని ఈ బైక్ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ బైక్ 373 సీసీ లిక్విడ్ కూల్ ఇంజిన్‌తో 6-గేర్ ట్రాన్స్‌మిషన్, 2-టైర్ డిస్క్ బ్రేక్, డిజిటల్ స్పీడో మీటర్ లాంటి పూర్తి అధునాతన ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed