కరోనా సమయంలోనూ నిధులు సమీకరించిన బజాజ్ ఫైనాన్స్!

by  |
కరోనా సమయంలోనూ నిధులు సమీకరించిన బజాజ్ ఫైనాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ దిగ్గజ సంస్థ బజాజ్ ఫైనాన్స్ డిబెంచర్ల ద్వారా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి మార్చి నెలలో రూ. 3,500 కోట్లను సమీకరించింది. కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో గణనీయమైన మొత్తాన్ని బజాజ్ ఫైనాన్స్ సమీకరించడం గమనార్హం. ఈ సమీకరణలో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ రూ. 750 కోట్ల నిధులను అందించినట్టు తెలుస్తోంది. ఈ నిధులను అధిక వ్యయ రుణాల రీఫైనాన్స్ కోసం, ఒత్తిడిలో ఉన్న రుణాల వృద్ధి కోసం వినియోగించనున్నట్టు సంస్థ తెలిపింది. ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ వల్ల బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు నిర్వహణ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వినియోగదారులకు మారటోరియం సదుపాయం కూడా లేకపోవడంతో అధిక ఎన్‌పీఏ, కేటాయింపుల ఒత్తిడి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇబ్బందిగా మారింది.



Next Story