మళ్లీ వర్క్ ఫ్రం హోం బాటలో కంపెనీలు

by  |
మళ్లీ వర్క్ ఫ్రం హోం బాటలో కంపెనీలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మరోసారి సెకెండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుండటంతో ఐటీ కంపెనీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పలు రంగాల్లో సంస్థలు వైట్-కాలర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కల్పించాయి. దేశీయగా దిగ్గజ ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం సహా ఐటీసీ, డెలాయిట్, మోతీలాల్ ఓస్వాల్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించాయి. ఆరోగ్యం విషయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరాయి. ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో అత్యవసరమైన సందర్భాల్లో తప్పించి బయటకు వెళ్లొద్దని కంపెనీ ఉన్నతాధికారులు పేర్కొన్నాయి.

ఐబీం, టీసీ కంపెనీలు తమ బెంగళూరు కార్యాలయాల్లో జూన్ చివరి వరకూ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ చేయాలని స్పష్టం చేశాయి. పలు కంపెనీలు తన ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నాయి. ఐటీసీ అయితే ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, ముందుగా అనుమతి తీసుకోకుండా ఆఫీసులకు రాకూడదని కూడా స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సైతం దేశవ్యాప్తంగా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు అవసరమైన సేవల కిందకు వచ్చినప్పటికీ తాము ఉద్యోగుల రక్షణ కోసం తక్కువ సిబ్బందినే ఆఫీసులకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నామని కంపెనీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెచ్ఆర్ హెడ్ సుధీర్ చెప్పారు.


Next Story

Most Viewed