జనవరి నుంచి బచ్చన్ పాండే..

by  |
జనవరి నుంచి బచ్చన్ పాండే..
X

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కొన్నేళ్లుగా చాలా బిజీ అయిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఏడాదికి కనీసం ఐదు సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. కరోనా టైమ్‌లో కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూర్యవంశీ’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ఈ మధ్యే ‘బెల్ బాటమ్’ షూటింగ్ కూడా ముగించాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో.. ఈ ఏడాది ఎండింగ్‌లో ‘అత్రంగి రే’ సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది అనుకున్న ప్లాన్ వర్కౌట్ చేసిన అక్షయ్.. నెక్ట్స్ ఇయర్‌లో ఫస్ట్ సినిమా షూటింగ్‌కు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేశాడు.

ఇక ఫర్హాద్ సమ్జీ డైరెక్షన్‌లో ‘బచ్చన్ పాండే’ సినిమా చేస్తున్న అక్షయ్.. జైసల్మేర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా రెండు నెలల పాటు కొనసాగనుంది. ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ కాగా.. షూటింగ్ అనుమతులు కూడా వచ్చేశాయి. ఈ సినిమాలో కృతి, అక్షయ్, ఫర్హాద్ కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతుంది. ఇప్పటికే ఈ ముగ్గురు ‘హౌజ్‌ఫుల్ 4’ సినిమాకు వర్క్ చేయగా ‘బచ్చన్ పాండే’పై అంచనాలు భారీగా ఉన్నాయి. సాజిద్ నడియాడ్వాలా ప్రొడక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ముంబై నుంచి ఇద్దరు డాక్టర్లు కూడా జైసల్మేర్ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ జరగనుండగా.. మూడు రోజుల పాటు మూవీ యూనిట్ సభ్యులు క్వారంటైన్‌లో ఉండబోతున్నారని సమాచారం.


Next Story

Most Viewed