అక్షయ్ ఫ్లాష్‌బ్యాక్‌ లైఫ్‌లో.. జాక్వెలిన్?

75

దిశ, సినిమా : కిలాడి అక్షయ్ కుమార్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్న సినిమా ‘బచ్చన్ పాండే’. అర్షద్ వార్శి కీలక పాత్రలో కనిపించబోతున్న సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్. ఇక ఈ మధ్యే అక్షయ్‌తో కలిసి షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలిపిన భామ.. మరో వారం రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేయనుందట. కాగా జాక్వెలిన్ ఈ చిత్రంలో అక్షయ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో కనిపించనుందని సమాచారం. అక్షయ్ గతంలో ఏం జరిగింది? గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందనేది చూపించే క్రమంలో జాక్వెలిన్ తన ప్రియురాలిగా స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనుందట. ఈ ఎపిసోడ్‌లో అక్షయ్ కోరమీసాలతో హ్యాండ్సమ్‌గా కనిపించనున్నాడట. సినిమాకు ఎమోషనల్ క్రస్ట్‌ను తీసుకొచ్చే విధంగా అక్షయ్, జాక్వెలిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ అండ్ సాంగ్స్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. కాగా బ్రదర్స్ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆల్రెడీ సూపర్బ్ అనిపించుకుంది. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘బచ్చన్ పాండేకు’ ఫర్హాద్ సంజీ దర్శకులు కాగా జనవరి 26, 2022న రిలీజ్ కానుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..