జగ్జీవన్‌రామ్ సేవలు ఆదర్శనీయం

by Chintha Aamani |   (  Updated:2020-04-05 01:47:05  IST  )

<p>దిశ, ఆదిలాబాద్ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 113 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిర్మల్ కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి [&hellip;]</p>

జగ్జీవన్‌రామ్ సేవలు ఆదర్శనీయం
X

దిశ, ఆదిలాబాద్

అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 113 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిర్మల్ కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ కె భాస్కర్ రావు పాల్గొన్నారు.

Tags: Babu jagjivan ram, 113th Jayanti, Adilabad, collector, musharraf faruqui

Next Story