ఏనుగుపై యోగా.. బోర్లాపడ్డ బాబా

by  |
ఏనుగుపై యోగా.. బోర్లాపడ్డ బాబా
X

దిశ, వెబ్‌డెస్క్: యోగా గురువు బాబా రాందేవ్‌ ఏనుగుపై యోగాభ్యాసం చేసే సమయంలో కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏనుగు మీద కూర్చొని యోగాసనం నేర్పిస్తున్న సమయంలో ఏనుగు కదలడంతో కిందపడిపోయారు. అయితే వెంటనే లేచిన బాబా.. నవ్వుకుంటూ పక్కకు వెళ్లిపోయారు. ఎలాంటి గాయాలు కాలేదు. సోమవారం మధురలోని రామనరేతి ఆశ్రమంలో సాధువులకు యోగాభ్యాసం నేర్పిస్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తూ దాదాపు 20వేల కంటే ఎక్కువ వ్యూస్‌ను సాధించింది.


Next Story

Most Viewed