దీపిక, భన్సాలీ మధ్య క్లాషెస్.. బీటౌన్‌లో చర్చ

by  |
దీపిక, భన్సాలీ మధ్య క్లాషెస్.. బీటౌన్‌లో చర్చ
X

దిశ, సినిమా : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే, మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఇద్దరి మధ్య చాలా గొప్ప బాండింగ్ ఉంది. మాసివ్ హిట్ కాంబినేషన్‌గా కొనసాగుతున్న ఇద్దరూ.. మరిన్ని క్లాసిక్ హిట్స్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. కానీ ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని బాలీవుడ్ టాక్.

ఆలియా భట్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘గంగూబాయి కతియావాడి’లో స్పెషల్ సాంగ్ చేయాలని భన్సాలీ దీపికను కోరగా రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఈ ఫిల్మ్ మేకర్ తెరకెక్కిస్తున్న ‘హీరామండి’ సిరీస్‌లో కీ రోల్, డ్యాన్స్ నంబర్ ఆఫర్ చేశారట. కానీ దీపికా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు అసలు ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ రిజెక్షన్స్ దీపిక, భన్సాలీకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయనేందుకు ఎగ్జాంపుల్స్. కాగా, భన్సాలీ ‘బైజు బవ్రా’ ప్రాజెక్ట్‌ను రణ్‌బీర్ కపూర్, ఆలియా, దీపికతో కలిసి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కనీసం ఈ సినిమా కోసమైనా భన్సాలీ మళ్లీ దీపికను అప్రోచ్ అవుతారని, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయనే ఆశాభావంతో ఉన్నారు ఫ్యాన్స్.

Next Story