అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ .. దేవాలయం తెరుచుకోనున్న తేదీలు..

1112

దిశ, వెబ్ డెస్క్: అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం శుభవార్త తెలిపింది. మండల మకరవిళక్కు పండగ సీజన్ లో భాగంగా వచ్చేవారం అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. రెండు నెలల పాటు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. అయితే రోజుకు 30 వేల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 15 న సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప స్వామి గర్భగుడిని తెరుస్తారు. భక్తులకు మాత్రం 16 వ తేదీ నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు.

డిసెంబర్ 26 న మండల పూజ అయిపోతుంది. డిసెంబర్ 30 మళ్లీ ఆలయం తెరుస్తారు. ఇక భక్తులంతా ఎంతో భక్తితో ఎదురు చూసే మకర జ్యోతి దర్శనం జనవరి 14 న ఉంటుంది. జనవరి 20 న ఆలయాన్ని మూసివేస్తారు. కరోనా కారణంగా కఠినమైన నిబంధనలు ఉంటాయని ఆలయ బోర్డు స్సష్టం చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..