- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ..
<p>దిశ, జల్పల్లి: శ్రీ అయ్యప్ప స్వామి శరణు గోషతో నాదర్‌గూల్ గ్రామం మారుమ్రోగింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గూల్ తోట ఎట్టారెడ్డి గార్డెన్లో18వ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భజనమండలి గంగపుత్ర నర్సింగ్‌రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఆలపించిన భక్తి గీతాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, […]</p>

దిశ, జల్పల్లి: శ్రీ అయ్యప్ప స్వామి శరణు గోషతో నాదర్‌గూల్ గ్రామం మారుమ్రోగింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గూల్ తోట ఎట్టారెడ్డి గార్డెన్లో18వ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భజనమండలి గంగపుత్ర నర్సింగ్‌రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఆలపించిన భక్తి గీతాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు కొలను శంకర్ రెడ్డి, బ్రహ్మశ్రీ యు.రామచంద్రన్ నాయర్ గురుస్వామి, పాలుబాయి అశోక్ గురుస్వామి, మర్రినర్సింహారెడ్డి, తిరుపెల్లి సుధాకర్ యాదవ్, యాతం భిక్షపతి యాదవ్ గురుస్వాములతో పాటు వందలాది మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని, స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.






