హాలియ పట్టణంలో అయ్యప్ప స్వామి మహ పడి పూజ మహోత్సవం

by  |
హాలియ పట్టణంలో అయ్యప్ప స్వామి మహ పడి పూజ మహోత్సవం
X

దిశ, హాలియ : భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా వేసుకునే అయ్యప్ప, ఆంజనేయ, శివయ్య, సాయిబాబా మాలలు ధరించి నిష్టగా 41 రోజులు దైవాన్ని కొలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు గాంచిన అయ్యప్ప స్వామి మాలను భక్తులు ఎక్కువగా ఆదరిస్తారు. 41 రోజులు నిష్టగా దీక్ష చేసి, ఇరుముడులు కట్టుకొని శబరి మలైకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని వస్తారు. ఈ దీక్ష సమయంలో ప్రతి రోజు స్వామిని స్మరిస్థుంటారు.

ఈ క్రమంలోనే ఎంతో పెరుగాంచిన శ్రీ హరి హరి పుత్ర అయ్యప్ప స్వామి మహ పడి పూజను హాలియ పట్టణంలో మాజీ CLP లీడర్ కుందురు జానారెడ్డి కుమారుడు కుందూరు జయ వీర్ రెడ్డి (కన్నెస్వామి) పాత ఐటీఐ ప్రాంగణంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. పడి పూజ కార్యక్రమాన్ని శబరిమళై పూజారి బ్రహ్మ శ్రీ సుధీర్ నంభూద్రీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హాలియ పట్టణంలోని సాయిబాబా మందిరం నుంచి అయ్యప్ప పల్లకి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా కార్తీక మాసం సందర్భంగా గోవులకు గో గ్రాసం అనగా గడ్డిని ఇస్తున్నట్లు జయవీర్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కుందురు జానారెడ్డి వారి కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గంలోని భక్తులు, వారి కుటుంబ సభ్యులు హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.


Next Story