డాక్టర్ కోట్ ధరించబోతున్న ఆయుష్మాన్

by  |
డాక్టర్ కోట్ ధరించబోతున్న ఆయుష్మాన్
X

దిశ, వెబ్‌డెస్క్ : వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. స్క్రిప్ట్‌తో పోజిస్తూ పిక్ షేర్ చేసిన ఆయుష్మాన్.. ‘డాక్టర్ జీ’గా వచ్చేస్తున్నట్టుగా తెలిపాడు. ఇంతకుముందు ‘బరేలీ కి బర్ఫీ, బదాయి హో’ సినిమాల ద్వారా జంగిల్ పిక్చర్స్‌తో కొలాబరేట్ అయిన తను.. ఇప్పుడు అదే సంస్థతో ముచ్చటగా మూడోసారి పనిచేయబోతున్నారు. అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో డాక్టర్‌గా కనిపించబోతున్న ఆయుష్.. త్వరలో కన్సల్టేషన్ స్టార్ట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. సౌరభ్ భరత్, విశాల్ వాఘ్ కథ అందిస్తున్న ఈ సినిమాకు సుమిత్ సక్సేనా, సౌరభ్ భరత్, విశాల్ వాఘ్‌తో కలిసి అనుభూతి కశ్యప్ స్క్రీన్‌ప్లే అందించనున్నారు.

గతంలో ‘ప్యార్ కా పంచనామా, లస్ట్ స్టోరీస్‌’కు డైలాగ్స్ అందించిన సుమిత్ సక్సేనా.. ఈ చిత్రానికి ప్రిపేర్ చేసే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయని తెలిపారు. యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘డాక్టర్ జీ’.. సూపర్ కామెడీ జర్నీగా ఉండడంతో పాటు ఆలోచింపజేసేలా ఉంటుందన్నారు ఆయుష్మాన్. ఫస్ట్ టైమ్ డాక్టర్ కోట్ ధరించబోతుండటం ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు.

మరోవైపు వాణి కపూర్‌తో జోడీ కట్టిన ఆయుష్మాన్ ‘చండీగఢ్ కరే దివానీ’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీంతో యూనిట్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.



Next Story

Most Viewed