- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తనువంతా రామమయం.. రామ్‌నామీ తెగ ప్రత్యేకం..
మరికొన్ని గంటల్లో అయోధ్య రామాలయ ప్రతిష్ఠ ఘనంగా జరగనుంది. కానీ, అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ముందే ఛత్తీస్ గఢ్ లో రామనామి జాతర జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: మరికొన్ని గంటల్లో అయోధ్య రామాలయ ప్రతిష్ఠ ఘనంగా జరగనుంది. కానీ, అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ముందే ఛత్తీస్ గఢ్ లో రామనామి జాతర జరిగింది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వమే ఈ జాతర నిర్వహించింది. కాగా, 150 ఏళ్ల క్రితమే తమ పూర్వీకులు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుందని ముందే చెప్పారని రామనామీలు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో రామనామీలు ఎవరు అనే విషయం తెరపైకి వచ్చింది.
దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో శాంతియుత ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం కారణంగానే చత్తీస్ ఘడ్ లో ని రామనామి సమాజ్ ఉద్భవించింది. ఈ తెగలోని చిన్నపిల్లలతో సహా అందరూ రామనామాన్ని పచ్చబొట్టుగా వేయించుకుంటారు. కనురెప్పలపై కూడా రాముడి పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంటారు. కాలి నుంచి తల వరకు రాముడి నామం వేయించుకుంటే.. నఖ్ శిఖ్.. అని నుదుటిపైనే పచ్చబొట్టు పొడిపించుకుంటే శిరోమణి అని పిలుస్తారు. కొందరైతే.. రామనామం ఉన్న దుస్తులతో రోజూ భజన చేస్తారు. నిరంతరం రామనామంతోనే ఉంటారు రామనామి తెగ ప్రజలు. రాముడి ఉనికి ప్రతిచోటా ఉంది అనే నమ్మకాన్ని కలిగిఉంటారు. అందుకే ఇప్పటికీ అక్కడ గుడి కట్టుకోలేదు.
1911లో భారీ వర్షాలకు రామనామీ తెగ నదిలో చిక్కుకుపోయింది. తమను కాపాడితే ఏటా ఘనంగా జాతర నిర్వహిస్తామని మొక్కుకున్నారు. దీంతో ఏటా మూడు రోజుల పాటు ఘనంగా రాముడికి రామనామీలు జాతర నిర్వహిస్తారు. తులసీదాస్ రామచరిత మానస్ లోని పద్యాలు చదువుతూ రాముడికి పూజ చేస్తారు. రామనామీలు లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. నెమలి ఈకలతో రూపొందించిన కిరీటాన్ని తలపై ధరిస్తారు. ఘుంగ్రాలను కూడా ధరిస్తారు. నృత్యాలు చేస్తూ రాముడి భజన చేసేటప్పుడు ఘుంగ్రాలే ప్రధాన ఆకర్షణ.
రామనామీలు పచ్చబొట్టు వేయించుకునే విధానం కొత్తగా ఉంటుంది. రామనామీలో పెద్ద వయసున్న వ్యక్తి పచ్చబొట్టు వేస్తారు. రెండు చెక్క సూదులు ఉపయోగించి పచ్చబొట్టు వేస్తారు. కిరోసిన్ ను మట్టి కుంటలో కాల్చగా వచ్చిన మసితో పచ్చబొట్టు పొడుస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సరైకెలా గ్రామానికి చెందిన రామనామి సెజ్వానా. తను చిన్నతనం నుంచి భక్తిగీతాలు పాడేదని ఆమె తెలిపారు. ఆమె రామనామి సంప్రదాయానికి చెందిన నాలుగో తరం మహిళ. ఆమె నివసించే ఇళ్లు, పరిసరాలు, దుస్తులు.. అన్నింటిపైనా రాముడి పేరే ఉంది.






