Ayodhya : జూన్ 3 నుంచి అయోధ్యలో రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ట

by Muthe.Rajitha |

అయోధ్య(Ayodhya)లోని శ్రీరామ జన్మభూమి మందిరం(Rama Mandir)లో రామ దర్బార్(Rama Darbar) ప్రాణ ప్రతిష్ఠ జూన్ 3 నుంచి 5 వరకు జరుగనుంది.

Ayodhya : జూన్ 3 నుంచి అయోధ్యలో రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ట
X

దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య(Ayodhya)లోని శ్రీరామ జన్మభూమి మందిరం(Rama Mandir)లో రామ దర్బార్(Rama Darbar) ప్రాణ ప్రతిష్ఠ జూన్ 3 నుంచి 5 వరకు జరుగనుంది. ఈ కార్యక్రమం అనంతరం జూన్ 6 నుంచి భక్తుల కోసం మొదటి అంతస్తు తెరవబడుతుందని ఆలయ నిర్వహకులు పేర్కొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయ నాయకులను, అధికారులను ఎవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని 101 మంది వేద పండితులకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్టు పేర్కొన్నారు. కాగా ఆలయంలోని మొదటి అంతస్తులో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో సహా 18 వైట్ మార్బుల్ విగ్రహాలు మే 23న ప్రతిష్ఠించబడనుండగా.. ఇప్పటికే ఈ విగ్రహాలు జైపూర్ నుంచి అయోధ్య చేరుకున్నాయని.. భరతుడు, శత్రుఘ్నుడి విగ్రహాలు తర్వాత స్థాపిస్తామని వెల్లడించారు.

జలవాస్, అన్నవాస్, ఔషధివాస్, శయ్యవాస్ ఆచారాల అనంతరం జూన్ 5న గంగా దసరాతో ఈ కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. మందిర సముదాయంలోని శివుడు, హనుమంతుడు, సూర్యుడు, గణేశుడు, దుర్గ, అన్నపూర్ణ ఆలయ శిఖరాలకు స్వర్ణ తాపడం పనులు నిన్నటి నుంచే ప్రారంభం అయ్యాయని తెలిపారు. కాగా మందిరం ప్రధాన భాగం ఆగస్టు-సెప్టెంబర్ 2025లో, పరకోట నవంబర్ 2025లో, మొత్తం సముదాయం డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Next Story