- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేలపై నిద్రిస్తూ.. సాత్వికాహారం తీసుకుంటూ ప్రధాని మోడీ నిష్ట
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరం గర్భగుడిలో జనవరి 22న బాలరాముడిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్ఠించనున్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరం గర్భగుడిలో జనవరి 22న బాలరాముడిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్ఠించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటి నుంచే పలు శాస్త్రబద్ధమైన నియమాలు, ఆచారాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. ‘యమ్ నియమాలను’ ప్రధాని మోడీ కచ్చితంగా పాటిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 11 రోజుల ప్రత్యేక నిష్టలో భాగంగా ఈనెల 11 నుంచే ఆయన ధ్యానం చేస్తూ.. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి లేని సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మనస్సు, శరీరాన్ని శుద్ధి చేస్తున్నారని చెప్పాయి. ఇందులో భాగంగా ప్రధాని మోడీ కేవలం దుప్పటితో నేలపై నిద్రిస్తున్నారని సమాచారం. రోజూ కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు వివరించాయి.
Next Story






