- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ మందిర ప్రాణప్రతిష్టలో కంగనా రనౌత్ సందడి (వీడియో)
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ క్రతువు జరిగింది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హెలికాప్టర్‌తో మందిరంపై పూలు చల్లారు. ప్రాణ ప్రతిష్టలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సందడి చేశారు. దేవుడు కొలువుదీరుతున్న వేళ ఆలయ ప్రాంగణం మొత్తం ‘జై శ్రీరాం’ నినాదాలతో మార్మొగింది. ఈ సందర్భంగా కంగనా సైతం బిగ్గరగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి కాషాయ రంగు ఉట్టిపడేలా చీరలో వచ్చిన కంగనా కూల్ సన్ గ్లాసెస్ వేసుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. ఇక, దేశ వ్యాప్తంగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా చోట్ల అన్నదానాలు చేయడం కనిపించింది. ఈ అరుదైన ఘట్టాన్ని చాలా మంది టీవీల్లో, మొబైల్ ఫోన్లలో లైవ్‌గా వీక్షించారు.






