అయోధ్య ఎఫెక్ట్.. స్కూల్‌లో ప్రజెంట్ సార్‌కు బదులు ‘జై శ్రీరామ్’

by Malleboina Mahesh |   (  Updated:2024-01-17 07:57:10  IST  )

సాధరణంగా తరగతి గదిలోకి టీచర్ రాగానే విద్యార్థులు గుడ్ మార్నింగ్ సార్, లేదా సమయాన్ని బట్టి విద్యార్ధులు క్లాస్‌లోకి టీచర్‌ను వెల్‌కమ్ చెబుతుంటారు.

అయోధ్య ఎఫెక్ట్.. స్కూల్‌లో ప్రజెంట్ సార్‌కు బదులు ‘జై శ్రీరామ్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధరణంగా తరగతి గదిలోకి టీచర్ రాగానే విద్యార్థులు గుడ్ మార్నింగ్ సార్, లేదా సమయాన్ని బట్టి విద్యార్ధులు క్లాస్‌లోకి టీచర్‌ను వెల్‌కమ్ చెబుతుంటారు. విద్యార్థుల అటెండెన్స్( హాజరు) తీసుకునే క్రమంలో విద్యార్థులు ప్రజెంట్ సార్/ మేడం, లేదా ఎస్ సార్/ మేడం లాంటివి చెబుతుంటారు. కానీ దానికి భిన్నంగా ఓ పాఠశాలల్లో విద్యార్థులు పలుకుతున్నారు. గుజరాత్‌లోని బనస్కాంత ప్రాంతంలోని ఓ పాఠశాలల్లో ఓ వీడియో తాజాగా సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. ఓ తరగతి గదిలోకి టీచర్ రాగానే విద్యార్థులు అందరూ నిలబడి ‘జై శ్రీరామ్’ స్లోగన్‌తో నమస్కారం చెప్పారు. మరోవైపు టీచర్ హాజరు తీసుకునేందుకు విద్యార్థుల పేర్లు ఒక్కొక్కరిగా పిలుస్తున్నారు. దానికి సమాధానంగా ప్రజెంట్ సార్, ఎస్ సార్ బదులు ‘జై శ్రీరామ్’ అంటూ టీచర్‌కు దండం పెడుతు అటెండెన్స్ పలుకుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముస్లిం విద్యార్థులు ఏమని పలుకాలని ప్రశ్నిస్తున్నారు. స్కూల్లో సెక్యూలర్‌గా ఉండాలంటున్నారు. మరికొందరు మాత్రం విద్యార్ధుల తీరుపై అభినందిస్తున్నారు. అన్ని స్కూళ్లలో ఈ విధంగానే విద్యార్థులు రోల్ కాల్ ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ కూడా అన్ని స్కూళ్లలో ఇలాంటి రోల్ కాల్ నిబంధనలు తీసుకరావాలని పలువురు కోరుతున్నారు. అయితే అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ విధంగా రోల్ కాల్ ఇస్తున్నారు.

Next Story