అయోధ్య ఎఫెక్ట్ వారికి బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఎప్పుడంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2024-01-19 07:37:18  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

అయోధ్య ఎఫెక్ట్ వారికి బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఎప్పుడంటే?
X

దిశ, ఫీచర్స్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరగనుంది. ఈ వేడుక చూసేందుకు దేశ ప్రజలంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆహ్వానాలు అందాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, కర్ణాటకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి జనవరి 18 నుండి జనవరి 22 వరకు గర్భిణులకు ఫ్రీగా డెలివరీ చేస్తామని ప్రకటించారు.

విజయపురలోని జేఎస్‌ఎస్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్న శ్రీ సిద్దేశ్వర లోక కళ్యాణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అయోధ్యలో ఈ సోమవారం జరగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని జనవరి 18 నుండి, మా ఆసుపత్రిలో జనవరి 22 వరకు ఉచితంగా డెలివరీ చేయబడుతుంది. ఇది చాలా పెద్ద సందర్భం. మేము గణనీయమైన రీతిలో సహకరించాలని కోరుకున్నాము. కాబట్టి ఐదు రోజుల పాటు మా ఆసుపత్రిలో జరిగే అన్ని ప్రసవాలు ఉచితంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాము’’ అని ఆసుపత్రి అధికారి తెలిపారు. అలాగే వారు ఇప్పటివరకు ఏడు డెలివరీలు ఉచితంగా చేశామని వెల్లడించారు.

Next Story