అయోధ్యలో అపూర్వఘట్టం.. వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ట

by GSrikanth |   (  Updated:2025-08-02 08:23:35  IST  )

అయోధ్య ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిల్లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహా ఘట్టాన్ని వేద పండితులు చేయించారు.

అయోధ్యలో అపూర్వఘట్టం.. వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ట
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహా ఘట్టాన్ని వేద పండితులు జరిపించారు. సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఒంటిగంటకు ముగియనుంది. అంనతరం మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ, రాజకీయ, వ్యాపారవేత్తల, క్రీడారంగానికి సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని యజమానిగా వ్యవహరించగా.. మోడీ పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.

Click For Video...

Next Story