2020-21లో యాక్సిస్ బ్యాంక్ లాభాలు 305 శాతం వృద్ధి

by  |
2020-21లో యాక్సిస్ బ్యాంక్ లాభాలు 305 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నికర లాభం ఏకంగా 305 శాతం పెరిగి రూ. 6,588 కోట్లుగా నమోదు చేసింది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 16 శాతం పెరిగి రూ. 29,239 కోట్లుగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ లాభం 10 శాతం పెరిగి రూ. 25,702 కోట్లకు చేరుకుందని తెలిపింది. మొత్తం కేటాయింపులు 9 శాతం క్షీణించి రూ. 16,896 కోట్లకు చేరుకోగా, వడ్డీ మార్జిన్ 3.53 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఇక, మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి సంబంధించి బ్యాంకు లాభం రూ. 2,677 కోట్లుగా నమోదైంది.

గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,388 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ. 7,555 కోట్లకు చేరుకోగా, గతేడాది ఇదే సమయంలో వడ్డీ ఆదాయం రూ. 6,808 కోట్లుగా పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన రుణాలు 12 శాతం పెరిగాయని, డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం పెరిగినట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, ఈ త్రైమాసికంలో బ్యాంకు కేటాయింపులు 58 శాతం క్షీణించి రూ. 3,295 కోట్లుగా నమోదు చేసింది. ఇక, స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)లు 5.25 శాతంగా ఉన్నాయని, నికర ఎన్‌పీఏలు 1.05 శాతంగా తగ్గుదల నమోదైనట్టు వెల్లడించినంది.


Next Story

Most Viewed