పూజ.. మై లక్కీ చార్మ్ : అల్లు అర్జున్

29

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ రిలీజై ఏడాదైన సందర్భంగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది మూవీ యూనిట్. 12 జనవరి, 2020న విడుదలైన సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా.. ఇటు ఆడియన్స్‌ నుంచి బెస్ట్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాదు నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టి ‘బిగ్గెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 2020’గా నిలిచింది. కాగా ఈ సక్సెస్‌కు వన్ ఇయర్ అయిన సందర్భంగా మూవీ యూనిట్ రీయూనియన్ అయింది. అల్లు ఎంటర్‌టైన్మెంట్ కార్యాలయంలో బన్నీ, పూజా హెగ్డే, సుశాంత్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, ఎస్.ఎస్.థమన్‌తో పాటు యూనిట్ సభ్యులంతా మీట్ అయ్యారు. కాగా, ఈ ఈవినింగ్ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను షేర్ చేసి, తనకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన యూనిట్‌కు థాంక్స్ చెప్పారు. పూజతో ఉన్న పిక్చర్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్.. తన ‘లక్కీ చార్మ్’ అని పొగిడేశాడు. ‘థాంక్స్ ఫర్ బీయింగ్ దెర్’ అని తెలిపాడు.