నువ్వు పుట్టడమే అదృష్టం : అవికా బాయ్‌ఫ్రెండ్

by  |
Avika-Gor,-Milind-Chandwani
X

దిశ, సినిమా: హీరోయిన్ అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చాంద్వాని స్పెషల్ నోట్‌తో స్వీట్ విష్ చేశాడు. అవిక పుట్టడమే తన అదృష్టమన్న మిలింద్ పోస్ట్ నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘హే బ్యూటిఫుల్.. నీలాంటి అద్భుతమైన వ్యక్తితో ఉండేందుకు నేనెంత అదృష్టవంతుడినో నాకు తెలియదు. నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ప్రపంచం కూడా చూడాలని కోరుకుంటున్నా. నీ చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరు సంతోషంగా ఉంటారు. బాధపెట్టిన వ్యక్తి కూడా ఆనందంగా ఉండాలని కోరుకునే నువ్వు.. అందరికీ గౌరవం ఇస్తూ దయగా ఉంటావు.

Avika-Gor

నువ్వు వర్క్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి మాటల్లో చెప్పలేను. నేను సోల్ మేట్స్‌ను నమ్మను కానీ.. నీ కళ్లు నా గుండెపై చూపించే ప్రభావాన్ని నమ్ముతున్నా. నేను ఎప్పుడూ నీకు సపోర్ట్‌గా ఉంటా, ఎందుకంటే నువు నాతో ఉంటావని తెలుసు’ అంటూ అవికను పొగడ్తల్లో ముంచేశాడు. తనను కలవకముందు సోషల్ వర్కర్‌ మిలింద్ చాంద్వానిగా, రౌడీస్ షో పార్టిసిపెంట్‌గా మాత్రమే గుర్తింపుపొందిన తాను.. ఇప్పుడు అవికా బాయ్‌ఫ్రెండ్‌గా పిలవబడుతున్నానని, ఇది తనకు నిజంగా గర్వంగా ఉంటుందని తెలిపాడు.



Next Story