- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ కు పోటీగా మరో కొత్త బైక్ వచ్చేస్తోంది
యెజ్డీ కంపెనీ నుంచి సరికొత్త వెహికల్ రాబోతోంది. యెజ్డీ స్క్రాంబ్లర్ పేరుతో ఈ బైక్ తీసుకురానున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల టూవీలర్ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర ఉండే వాహనాలను తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే యెజ్డీ కంపెనీ నుంచి సరికొత్త వెహికల్ రాబోతోంది. యెజ్డీ స్క్రాంబ్లర్ పేరుతో ఈ బైక్ తీసుకురానున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411, ట్రయాంఫ్ స్క్రాంబ్లర్ 400X లాంటి బైక్స్ కు గట్టి పోటీ ఇచ్చేందుకుగాను ఈ యెజ్డీ స్క్రాంబ్లర్ ( Yezdi scrambler) బైక్ తీసుకువస్తున్నారు.
యెజ్డీ స్క్రాంబ్లర్ అదిరిపోయే ఫీచర్స్ ఇవే
334 CC లిక్విడ్ కూల్డ్ ఆల్ఫా 2 ఇంజన్ ను ఈ యెజ్డీ స్క్రాంబ్లర్ బైక్ లో వాడుతున్నారు. 29 PS పవర్, 29.8 nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో ఎల్ఈడీ కొత్త మోడల్ హెడ్ లాంప్, టైల్ లాంప్, ఇండికేటర్లు కూడా అందిస్తున్నారు. ఈ బైక్ రిలీజ్ అయ్యే రోజున BSA 650 CC స్క్రాంబ్లర్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. ఇందులో యెజ్డీ స్క్రాంబ్లర్ బైక్ ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.30 లక్షల మంది ఉండే ఛాన్స్ లు ఉన్నాయి. BSA స్క్రాంబ్లర్ 650 సీసీ బైక్ మూడున్నర లక్షల వరకు ఉండనుంది.






