హీరో నుంచి అదిరిపోయే ఎల‌క్ట్రిక్ బైక్‌..100 కిలోమీటర్ల మైలేజ్

by velandi.Saikiran |

Vida VX2 Go బైక్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, ఇందులో 3.4 kwh బ్యాటరీ ఆప్షన్ అందిస్తున్నారు. ఈ బైక్ ఒకసారి ఫుల్ చార్జింగ్

Vida VX2 Go
X

Vida VX2 Go

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అధికమైంది. ఇలాంటి నేపథ్యంలో హీరో మోటో కార్ప్ సంస్థ ( Hero MotoCorp ) నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. Vida VX2 Go పేరుతో అదిరిపోయే బైక్ తీసుకువచ్చింది కంపెనీ. ఈ బైకు ప్రారంభ ధర రూ.1.02 లక్షలుగా ఫిక్స్ చేశారు. ఢిల్లీలోని షోరూం ప్రకారం మాత్రమే ఈ రేటు. ఇతర ప్రాంతాల్లో ధర మార్పు జరుగుతుంది.

ఇక ఈ Vida VX2 Go బైక్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, ఇందులో 3.4 kwh బ్యాటరీ ఆప్షన్ అందిస్తున్నారు. ఈ బైక్ ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 100 కిలో మీటర్ల మైలేజ్ కూడా ఇస్తుంది. గంటకు 70 కిలో మీటర్ల వేగంతో ఈ బైక్ దూసుకు వెళ్తుంది. 4.3 ఇంచుల డిస్ప్లే అందిస్తున్నారు. ఈ బైక్ ను స్మార్ట్ ఫోన్ తో కూడా కనెక్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నావిగేషన్ మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్ ఆప్షన్స్ కూడా మనకు వస్తాయి. ఈ నెలలోనే బైక్స్ డెలివరీలు ప్రారంభమవుతాయి.

Next Story