- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TVS Electric Auto: వావ్.. ఈ టీవీఎస్ ఆటో చూశారా? భలే ఉందిగా.. ధర ఎంతంటే?
TVS Electric Auto: టీవీఎస్ మోటార్స్ కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి త్రీ వీలర్ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున విస్తరించినందుకు సిద్ధమవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : TVS Electric Auto: టీవీఎస్ మోటార్స్ కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి త్రీ వీలర్ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున విస్తరించినందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కొత్త ఎలక్ట్రిక్ ఆటో TVS King EV Maxను విడుదల చేసింది. దీని ధర కేవలం రూ. 2.95 లక్షలు గా నిర్ణయించారు. ముఖ్యంగా వాణిజ్య అదే విధంగా ప్యాసింజర్ రవాణా కోసం దీనిని రూపొందించారు.
ఈ ఆటో రిక్షా విషయానికొస్తే ముఖ్యంగా దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 51.2V లిథియం-అయాన్ LFP బ్యాటరీ ఉపయోగించారు. ఇందులో గరిష్టంగా 11 కిలోవాట్లు శక్తి ఉత్పత్తి అవుతుంది. 40 Nm టార్క్ శక్తితో నడుస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే చాలు 179 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని చార్జింగ్ సమయం వచ్చేసి 3.5 గంటలు. రాత్రిపూట చార్జింగ్ పెట్టుకున్నట్లైతే ఉదయం అంతా తిప్పుకోవచ్చు. మళ్లీ మధ్యాహ్నం కాని సాయంత్రం కానీ చార్జింగ్ పెట్టుకున్నట్లైతే మిగతా రోజు మొత్తం తిరగవచ్చు.
ఇందులో మొత్తం మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి ఎకో మోడ్ అంటే 40 కిమీ వేగంతో తిరగవచ్చు. సిటీ మోడ్ అంటే 50 కిమీ ప్రతి గంటకు తిరగవచ్చు. ఇక పవర్ మోడ్ అంటే గంటకు 60 కిమీ వేగంతో తిరగవచ్చు. ఇందులో కేవలం3.7 సెకన్లలో 30 కిమీ. ప్రతి గంట వేగం అందుకుంటుంది. ఇందులోని స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే TVS SmartXonnect బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీతో రియల్‌టైమ్ నావిగేషన్, వెహికిల్ డయాగ్నోస్టిక్స్, అలర్ట్స్‌ను స్మార్ట్‌ఫోన్ ద్వారా పొందవచ్చు.
LCD డిస్‌ప్లే ఇందులో చూడవచ్చు. లైటింగ్ విషయానికి వస్తే LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్ ఇందులో చూడవచ్చు. ఈ వాహనానికి కంపెనీ వారంటీ 6 సంవత్సరాలుగా ఉంది., మొదటి 3 సంవత్సరాల పాటు 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందించున్నారు. TVS King EV Max వాణిజ్య అవసరాలతో పాటు ప్రయాణికులకు కూడా ఎంతో సౌలభ్యంగా సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ లో కమర్షియల్ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని లాస్ట్ మైల్ డెలివరీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇవి సరుకుల రవాణాకు ఎంతగానో ఉపయోగపడతాయి.






