- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాప్ 5 సెవెన్-సీటర్ సరికొత్త కార్లు..ధర, ఫీచర్స్
మారుతి, టాటా, హుందాయ్ కంపెనీలలో 7 సీటర్ కార్లు వైరల్ గా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వ్యాప్తంగా సెవెన్ సీటర్ కార్ల విక్రయాలు విపరీతంగా జరుగుతున్నాయి. మధ్య తరగతి వాళ్లకు కూడా అందుబాటు ధరలో ఉన్న నేపథ్యంలో వీటి సేల్స్ పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో హాట్ కేకుల్లాగా సేల్ అయిన కార్ల వివరాలు ఒకసారి చూద్దాం. మారుతి సుజుకి ఎర్టిగా కారుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది. ఈ కారు ధర రూ. 9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మహీంద్రా స్కార్పియో N మోడల్ కారు కూడా యువతను ఆకట్టుకుంతోంది. ఈ కారు ధర రూ.13.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ను సెవెన్ సీటర్ గా విపరీతంగా వాడుతున్నారు. దూర ప్రయాణాలకు ఈ కార్లు బెస్ట్. రూ.20 లక్షల నుంచి ఈ కారు ప్రారంభమవుతుంది. ఇక మహీంద్రా XUV 700 కారుకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది. ఈ కారులో ఏడు మంది ప్రయాణికులు సులభంగా వెళ్ళవచ్చు. ఈ కారు ధర రూ.14 లక్షల నుంచి ప్రారంభం కానుంది. కియా కారెన్స్ రూ.11 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. పైన పేర్కొన్న సెవెన్ సీటర్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.






