Tata Punch Facelift: రూ.5.59 ల‌క్ష‌ల‌కే టాటా కారు...అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

టాటా పంచ్ ఫేస్ లిస్ట్‌ మోడల్ కార్లు ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్‌ చేసింది కంపెనీ.

Tata Punch Facelift: రూ.5.59 ల‌క్ష‌ల‌కే టాటా కారు...అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారతదేశ ఆటోమొబైల్స్ రంగంలో టాటా కంపెనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తక్కువ ధరలో, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుగోలు చేసేలా ఈ టాటా కంపెనీ నుంచి కార్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రతీ కారు 5 స్టార్ రేటింగ్ కూడా కలిగి ఉంటుంది. టిప్పర్ లారీ ఢీ కొట్టినా కూడా, టాటా కారుకు పెద్దగా డ్యామేజ్ లు కావు. ఇతర కంపెనీల కార్లు అయితే, చాలా డ్యామేజ్ అవుతాయి. అలా తక్కువ ధరలో కార్లు ఇస్తూ, మంచి ప్రోడక్ట్ అందిస్తోంది టాటా. ఈ నేపథ్యంలోనే టాటా నుంచి మరో కారు ఇండియ‌న్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వ‌చ్చాయి. టాటా పంచ్ ఫేస్ లిస్ట్‌ మోడల్ కార్లు ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్‌ చేసింది కంపెనీ. ఈ కారు ధర కేవలం రూ.5.59 లక్షలు మాత్రమే. ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారం అన్న విషయం మర్చిపోవద్దు. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభం అయినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

టాటా పంచ్ ఫేస్ లిస్ట్‌ ఫీచర్స్

కొత్తగా మార్కెట్ లోకి వ‌చ్చిన‌ టాటా పంచ్ ఫేస్ లిస్ట్‌ కారులో 26.3 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ అందిస్తున్నారు. 17.8 సెంటీమీటర్ల డిజిటల్ క్లస్టర్లు కూడా కంపెనీ ఇస్తుంది. 360 డిగ్రీ కెమెరా కూడా ఈ కారుకు రానుంది. ఎప్పటిలాగే ఈ టాటా పంచ్ ఫేస్ లిస్ట్‌ కారుకు కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఈ కారులో ఆరుగురు ప్యాసింజర్లు సులభంగా ప్రయాణించవచ్చు. దానికి తగ్గట్టుగానే 6 ఎయిర్‌ బ్యాగులు అందిస్తోంది కంపెనీ. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ.10.15 లక్షల వరకు ఉంటుందట. అలాగే సిఎన్జి వేరియంట్ రూ.7.25 లక్షల నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.




Next Story