- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో అత్యధికంగా సేల్స్..టాటా కారు ధర, ఫీచర్స్ ఇవే
ఇండియన్ మార్కెట్ లో వాహనదారులందరూ టాటా నెక్సన్ కార్లను విపరీతంగా కొనుగోలు చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లో టాటా కార్లకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు. ఎక్కడ చూసినా టాటాకు సంబంధించిన కార్లు కనిపిస్తూ ఉంటాయి. సామాన్యులకు అందుబాటులో ఉండేలా, ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తూనే అదిరిపోయే కార్లు అందిస్తోంది టాటా కంపెనీ. మైలేజ్ విషయంలో తప్ప అన్ని విభాగాల్లో టాటా కారును మించిన మరో కారు ఉండదని చెబుతూ ఉంటారు వాహనదారులు. అయితే టాటా విడుదల చేసిన కార్లలో నెక్సాన్ ( Tata Nexon ) ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇండియాలో అత్యధికంగా సేల్స్ ఉన్న కారుగా టాటా నెక్సన్ రికార్డు సృష్టించింది.
ఇండియన్ మార్కెట్ లో దూసుకు వెళ్తున్న టాటా నెక్సన్
ఇండియన్ మార్కెట్ లో వాహనదారులందరూ టాటా నెక్సన్ కార్లను విపరీతంగా కొనుగోలు చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ కార్ల సేల్స్ అమాంతం పెరిగిపోయాయి అంట. ఈ కార్లు ఎక్కువగా సేల్ కావడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అందులో సేఫ్టీ, మోడల్స్, అదిరిపోయే ఫీచర్లతో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా ధర ఉన్నాయి. ఈ టాటా నెక్సన్ కారు 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంటుంది. అందుకే జనాలు విపరీతంగా ఈ కార్లను కొనుగోలు చేస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
దాంతో పాటు ఇందులో అన్ని మోడల్ కార్లు లభిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ తో పాటు ఎలక్ట్రిక్ మోడల్స్ లో కూడా ఈ టాటా నెక్సన్ దూసుకు వెళ్తోంది. ఎలక్ట్రిక్ మోడల్ లో ఈ టాటా నెక్సన్ కారును మించిన మరోటి లేదు. దానికి తగ్గట్టుగానే అదిరిపోయే ఫీచర్స్ కూడా అందిస్తోంది కంపెనీ. 360 డిగ్రీ కెమెరా, సన్ రూఫ్ కూడా అందిస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ లో భాగంగా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. అడ్వాన్స్ టెక్నాలజీతో డిస్ ప్లే కూడా అందిస్తున్నారు. ఇక ఈ కారు ఎక్స్ షోరూం ధర వచ్చేసరికి 8 లక్షలు గా ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కారు ధర ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే టాటా నెక్సన్ సేల్స్ లో దూసుకు వెళుతోందని కంపెనీ చెబుతోంది.






