- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుజుకి నుంచి మరో బైక్...ధర, ఫీచర్స్ ఇవే
సుజుకి బర్గ్‌మాన్ 400 స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వ్యాప్తంగా సుజికి కంపెనీకి ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. చాలా మంది ఈ కంపెనీకి సంబంధించిన వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి సుజుకి బర్గ్‌మాన్ 400 స్కూటర్ ను ( Suzuki Burgman 400) ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త మోడల్ పరిచయం చేశారు. ఈ సుజుకి బర్గ్‌మాన్ 400 బైక్ ను మరో మూడు నెలల్లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుజుకి బర్గ్‌మాన్ 400 స్కూటర్ ఫీచర్స్, ధర
ఈ సుజుకి బర్గ్‌మాన్ 400 స్కూటర్ సింగిల్ సిలిండర్ తో రానుంది. 29 నుంచి 31 మధ్య PS పవర్, 35-36 NM టార్క్ రిలీజ్ చేయనుంది. 260 ఎంఎం డిస్క్ బ్రేకులు ముందు భాగంలో ఇవ్వనున్నారు. వెనక 210 mm డిస్క్ బ్రేకులు అందించనున్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం కూడా రానుంది. ఈ బైక్ లో 42 లీటర్ల ఇంధనం పడుతుంది. ఇండియాలో లాంచ్ అయితే ఈ బైక్ ధర రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే అంటున్నారు.






