- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడ్జెట్ లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ !
సింపుల్ ఎనర్జీ నుంచి అల్ట్రా పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. రెండు కూడా సెంచరీ దాటిపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ స్కూటర్లు బోలెడు లాంచ్ అవుతున్నాయి. తాజాగా సింపుల్ ఎనర్జీ నుంచి అల్ట్రా పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది.
అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్, ధర వివరాలు
సింపుల్ ఎనర్జీ నుంచి విడుదలైన అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.2.35 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూం ప్రకారం మాత్రమే. వివిధ నగరాలలో ఒక్కో ధర ఉంటుంది. ఇక ఈ అల్ట్రా స్కూటర్ కు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే, 400 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్ అమర్చింది కంపెనీ. సెకండ్ల వ్యవధిలోనే అత్యధిక వేగాన్ని స్కూటర్ అందుకుంటుంది. ఈ స్కూటర్ కు టచ్ స్క్రీన్ డిస్ ప్లే, నావిగేషన్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 115 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకు వెళ్తుంది. 2.77 సెకండ్లలో 40 కిలో మీటర్ల వేగాన్ని కూడా అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది.






