భారత మార్కెట్లోకి ‘రెనాల్ట్ డస్టర్’ రీ-ఎంట్రీ: రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో లుక్ అదుర్స్

by Kema Shiva Kumar |

ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్-2026 భారత మార్కెట్‌లోకి విడుదలైంది.

భారత మార్కెట్లోకి ‘రెనాల్ట్ డస్టర్’ రీ-ఎంట్రీ: రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో లుక్ అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘రెనాల్ట్ డస్టర్’ సరికొత్త హంగులతో మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మూడో తరం డస్టర్ ఎస్‌యూవీని రెనాల్ట్ ఇండియా ఇవాళ అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ కారు, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో క్రెటా, సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వనుంది. అయితే, ఈ ఎక్స్‌యూవీ ప్రారంభ ధర రూ.10.49 లక్షలుగా నిర్ణయించారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మార్చి 31 వరకు రూ.10.29 లక్షలకే లభించనుంది. ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్ల ఆధారంగా రూ.18.49 లక్షల వరకు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

వై-షేప్డ్ (Y-shaped) ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 18-ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, 212 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో రగ్గ్‌డ్ లుక్‌తో రెనాల్డ్ డస్టర్ ఎక్స్‌యూవీ కనిపిస్తోంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (గూగుల్ బిల్ట్-ఇన్), 10.25-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, మరియు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ (ADAS) వంటి 17 అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో టర్బో పెట్రోల్ వేరియంట్ల డెలివరీలు ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి రానుంది.

Next Story