- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవర్ లేకుండా ఆటోలు...120 కిమీ మైలేజ్..ధర, ఫీచర్స్ ఇవే
ఒమేగా సీకి మొబిలిటీ ( Omega Seiki Mobility ) కంపెనీ అదిరిపోయే ప్రకటన చేసింది. తొలి సెల్ఫ్ డ్రైవింగ్ త్రీ వీలర్ ఆటో

దిశ, వెబ్ డెస్క్: ఒమేగా సీకి మొబిలిటీ ( Omega Seiki Mobility ) కంపెనీ అదిరిపోయే ప్రకటన చేసింది. తొలి సెల్ఫ్ డ్రైవింగ్ త్రీ వీలర్ ఆటో తాజాగా లాంచ్ చేసింది ఈ ఒమేగా సీకి మొబిలిటీ. స్వయంగతి పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఆటోను తీసుకువచ్చింది కంపెనీ. దసరా నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ ఆటోను తీసుకు వచ్చినట్లు అధికారికంగా ప్రకటన చేసింది.
ఇందులో కొత్త మోడల్ ప్యాసింజర్ మోడల్ ఆటో ధర వచ్చేసి నాలుగు లక్షలుగా ఫిక్స్ చేశారు. ఈ ధర ఎక్స్ షోరూం ప్రకారం మాత్రమే. ఇక కార్గో వర్షన్ ఆటో ధర 4.15 లక్షలుగా... ఫైనల్ చేశారు. ఇప్పటికే ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కాగా త్వరలోనే డెలివరీ చేస్తామని ప్రకటన చేసింది కంపెనీ. ఇక ఈ స్వయంగతి అటో 10.3 kwh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల మైలేజ్ అందించనుంది ఈ ఆటో.
ముఖ్యంగా.. ఈ ఎలక్ట్రిక్ ఆటో ఏఐ ఆధారిత.. ఆటోమెటిక్ మిషన్. ఇది పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో కావడం గమనార్హం. అంటే డ్రైవర్ లేకుండా సరే.. టెక్నాలజీ తో ముందుకు వెళుతుంది. మనం టార్గెట్ ఫిక్స్ చేస్తే అక్కడికి వెళ్లి.. పని కాని చేస్తుంది. మరో రెండు సంవత్సరాలలోనే 1500 సెల్ఫ్ డ్రైవింగ్ త్రీ వీలర్ ఆటోలను తీసుకువస్తామని ఒమేగా సీకి మొబిలిటీ కంపెనీ వెల్లడించింది.






