Nissan India: రూ.65,000 డిస్కౌంట్, గోల్డ్‌ కాయిన్‌ ఫ్రీ.. ఈ SUVపై భలే ఆఫర్!

by Vennela |

Nissan India: దేశంలో ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతోంది.

Nissan India: రూ.65,000 డిస్కౌంట్, గోల్డ్‌ కాయిన్‌ ఫ్రీ..  ఈ SUVపై భలే ఆఫర్!
X

దిశ, వెబ్ డెస్క్: Nissan India: దేశంలో ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిస్సాన్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్ యూవీ మాగ్నైట్ పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ కారు కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీగా అందిస్తోంది.

IPL క్రికెట్ సీజన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నిస్సాన్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV కోసం మాగ్నైట్ హ్యాట్రిక్ కార్నివాల్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద, ఈ SUV పై రూ. 55,000 వరకు ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కారు కొనుగోలు చేస్తే ఫ్రీగా గోల్డ్ కాయిన్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, మీరు మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మాగ్నైట్ ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ధర,ఫీచర్లు:

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.14 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. కానీ లోపలి భాగం మిమ్మల్ని కాస్త నిరాశపరుస్తుంది. ఈ కారులో ఐదుగురు హాయిగా కూర్చోవచ్చు. వెనుక కూర్చున్న వారికి స్థలం కొరత లేదు. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, మాగ్నైట్‌లోని 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఇప్పుడు కొత్త గ్రాఫిక్స్ చూడవచ్చు. కొత్త మాగ్నైట్ సింగిల్-పాన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కూడా ఉంటుంది. దానితో పాటు ఒక కొత్త కీ కూడా అందుబాటులో ఉంది. ఇది ఆటో లాక్, అప్రోచ్ అన్‌లాక్, రిమోట్ స్టార్ట్‌ను యాక్టివేట్ చేస్తుంది.

ఇంజిన్, భద్రత:

మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ తోపాటు 1.0L పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అంతేకాదు ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ MT లేదా CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. కొత్త మాగ్నైట్ మీకు 20kmpl వరకు మైలేజీని అందిస్తుంది. ఇక సేఫ్టీ పరంగా ఈ కారుకు 4 స్టార్ రేటింగ్ లభించింది.

భద్రతా ఫీచర్ల గురించి తెలుసుకుంటే.. మాగ్నైట్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, EBD తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి కొత్తగా రూపొందించిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించింది. నిస్సాన్ మాగ్నైట్ నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లతో పోటీపడుతుంది. ఎక్సెటర్ ధర రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. పంచ్ ధర రూ. 6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Next Story