మహీంద్రా కీలక నిర్ణయం.. ఏప్రిల్ 6 నుంచి పెరగనున్న ధ‌ర‌లు

by velandi.Saikiran |

నాన్-ఎలక్ట్రిక్ SUVలు, వాణిజ్య వాహనాల ధరలను గరిష్టంగా 2.5% పెంచబోతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది మహీంద్రా.

Mahindra announces price hike across SUV and CV range effective April 6, 2026
X

Mahindra announces price hike across SUV and CV range effective April 6, 2026

దిశ‌, వెబ్ డెస్క్‌: మహీంద్రా ( Mahindra) వాహనాలు కొనుగోలు చేసే వారికి ఊహించని షాక్ తగిలింది. తమ వాహనాల ధరలను పెంచబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది మహేంద్రా అండ్ మహీంద్రా కంపెనీ. మార్కెట్లో మహేంద్రా కంపెనీకి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది, మిగ‌తా కంపెనీల‌ను కాద‌ని ఈ మహేంద్ర కంపెనీకి సంబంధించిన కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే అలాంటి వారికి షాక్ ఇస్తూ, తాజాగా ఈ మహేంద్రాకు సంబంధించిన వాహనాల ధరలను అమాంతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. నాన్-ఎలక్ట్రిక్ SUVలు, వాణిజ్య వాహనాల ధరలను గరిష్టంగా 2.5% పెంచబోతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

2.5% ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం

ఇక మొత్తం వాహన పోర్టు పోలియోపై ధరల పెంపు సగటున 1.6 పర్సెంటేజ్ ఉంటుందని వివరణ ఇచ్చింది మ‌హేంద్రా కంపెనీ. ఇక పెంచిన ధరలు ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కీలక ప్రకటన చేసింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకుగాను తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఈ పెంపుదల నేపథ్యంలో మోడల్, వేరియంట్ ను బట్టి వాహనాల ధర వేరువేరుగా పెరుగుతుంది. అటు ఇటీవల మహేంద్ర నుంచి వ‌చ్చిన XUV 7XO వెహికల్ ధర మాత్రం మొదటి నలభై వేల మంది కొనుగోలుదారులకు మాత్రమే పెరగబోద‌ని స్పష్టం చేసింది. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాళ్లందరికీ పెంపుదల వర్తిస్తుందని మహీంద్రా వెల్లడించింది.

Next Story