- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VinFast:మార్కెట్లోకి కొత్త ఈవీ బైక్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 262 కి.మీ
వియత్నాంకు సంబంధించిన ఈ విన్ ఫాస్ట్ బైక్స్ తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో తయారు కాబోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటిన నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇక ఈ తరుణంలోనే వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ విన్ ఫాస్ట్ కీలక ప్రకటన చేసింది. ఈ కంపెనీ నుంచి ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు రాబోతున్నాయి. డిసెంబర్ 2026 ముగిసే సమయానికి ఈ కొత్త బైక్స్ వస్తాయని అంటున్నారు. Vinfast EV పేరుతో ఈ బైక్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడులో తయారీ
వియత్నాంకు సంబంధించిన ఈ విన్ ఫాస్ట్ బైక్స్ తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో తయారు కాబోతున్నాయి. ఈ మేరకు ఈ కంపెనీకి సంబంధించిన ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 500 మిలియన్ల డాలర్లు ఈ ప్లాంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పది లక్షల యూనిట్లు తయారు చేయడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది. అంటే ఈ లెక్కన డిసెంబర్ మాసంలో ఈ కంపెనీకి సంబంధించిన బైక్స్ ఇండియాలో లాంచ్ అవుతాయి. ఇక ఈ బైక్స్ రూ. 65,000 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. టాప్ ఎండ్ మోడల్ రూ.1,65,000 వరకు ఉంటుంది. ఇందులో బడ్జెట్ లో వచ్చే మొదటి వేరియంట్ ను vinfast EVO పేరుతో తీసుకువస్తున్నారు. ఈ బైక్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 134 కిలో మీటర్ల నుంచి 250 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. Vinfast Feliz మోడల్ బైక్ ఒకే ఛార్జింగ్ పై సుమారు 262 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. Vinfast viper మోడల్ మొత్తం స్పోర్ట్స్ బైక్స్ అని తెలుస్తోంది






