Kavya Maran Car Collection: కార్ క్వీన్.. కావ్యపాప దగ్గర ఉన్న ఈ కార్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగిపొద్ది అక్కో

by Vennela |

Kavya Maran Car Collection: ఐపీఎల్ 2024లో తమ ఆటతీరుతో అందర్నీ ఆకర్షించిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్.

Kavya Maran Car Collection: కార్ క్వీన్.. కావ్యపాప దగ్గర ఉన్న ఈ కార్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగిపొద్ది అక్కో
X

దిశ, వెబ్ డెస్క్: Kavya Maran Car Collection: ఐపీఎల్ 2024లో తమ ఆటతీరుతో అందర్నీ ఆకర్షించిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. దూకుడైన బ్యాటింగ్ తీరుతో ప్రత్యర్థి జట్లకు పగలే చుక్కలు చూపించింది. ఐపీఎల్ చరిత్రలోనే భారీ స్కోర్లను నమోదు చేసుకుంది. ఐపీఎల్ 2024 రన్నరప్ గా నిలిచింది ఈ జట్టు. ఈ సారి కూడా కప్పు కొట్టాలన్న టార్గెట్ పెట్టుకుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడు మ్యాచ్ ఆడినా..స్టేడియంలో మాత్రం ఫ్రాంజైజీ ఓనర్ కావ్య మారన్ తప్పకుండా ఉంటుంది.

ఇక క్రికెట్ కావ్యపాపకు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే క్రికెట్ తోపాటు 33ఏళ్ల కావ్యకు కార్లంటే పిచ్చి. ఆమె గ్యారెజీలో రోల్స్ రాయ్స్, ఫెరారీ, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కావ్య కార్ కలెక్షన్స్ లో ఉన్న లగ్జరీ కార్లపై ఓ లుక్కెద్దాం.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB:

కావ్య మారన్ మొదటి లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB. దీని ధర రూ. 12 కోట్ల 20 లక్షలు. ఈ రోల్స్ రాయిస్ కారులో, మీరు 6.75-లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ ఉంటుంది. 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ సహాయంతో రోడ్డుపై నడుస్తుంది. ఈ కారు ఇంజిన్ 571 hp శక్తిని, 900 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బెంట్లీ బెంటెగా EWB:

కావ్య లగ్జరీ గ్యారేజీలో రెండవ ఖరీదైన కారు బెంట్లీ బెంటాయ్గా EWB. ఇది 22-అంగుళాల చక్రాలతో వస్తుంది. ఈ కారు ధర గురించి మాట్లాడుకుంటే, దీని ధర దాదాపు రూ.6 కోట్లు. ఈ బెంట్లీ కారులో 4.0-లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ అమర్చి ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో వస్తుంది.

బిఎండబ్ల్యూ ఐ7:

మూడవ కారు BMW i7. ఇది భారత మార్కెట్లో రూ. 2.03 కోట్ల ప్రారంభ ధరకు లభిస్తుంది. కావ్య BMW i7 కారులో 101.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 50 నిమిషాలు పడుతుంది. ఈ కారు పరిధి 603 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ఫెర్రైస్ రోమా:

కావ్య మారన్ లగ్జరీ కార్ల సేకరణలో నాల్గవ కారు ఫెర్రాయ్ రోమా. ఇది ఎరుపు రంగు రేసింగ్ కారు. ఈ కారు ధర దాదాపు రూ.4.5 కోట్లు. ఈ ఫెరారీ కారు 3.4 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగంతో పరిగెత్తగలదు.

Next Story