Upcoming electric SUV: రయ్‌ రయ్‌.. ఇండియాలో లాంచ్‌కు రెడీగా ఉన్న ఈ 5 ఎలక్ట్రిక్ SUVల గురించి తెలుసుకోండి!

by Vennela |

Upcoming electric SUV: మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల సందడి నడుస్తోంది.

Upcoming electric SUV: రయ్‌ రయ్‌.. ఇండియాలో లాంచ్‌కు రెడీగా ఉన్న ఈ 5 ఎలక్ట్రిక్ SUVల గురించి తెలుసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: Upcoming electric SUV: మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల సందడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొత్తం ఐదు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సరికొత్త మోడల్స్ రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి. అధిక మైలేజీ అధిక సామర్థ్యంతో వచ్చే ఈ కార్లు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి మంచి ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చే ఆ టాప్ ఫైవ్ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.

Tata Harrier EV –

ఈ కారు జూన్ మూడవ తేదీ మార్కెట్లోకి లాంచ్ అవబోతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ కు చెందిన ఈ ఎలక్ట్రికల్ వెహికల్ చక్కటి రెస్పాన్స్ అందుకుంది. ఈ కార్ మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే, ఒకసారి చార్జ్ చేస్తే చాలు సుమారు 500 కిలోమీటర్ల రేంజ్. మైలేజ్ అందిస్తుంది. ఈ కారులో ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, 360 డిగ్రీ కెమెరా, ESC, Level 2 ADAS లాంటి ఫీచర్లు. ప్రధానంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక లుక్ విషయానికి వస్తే ఈ కారు మంచి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తుంది.

Kia Clavis EV –

కియా మోటార్స్ నుంచి వచ్చే ఈ కారు అతి త్వరలోనే మార్కెట్లో సందడి చేయనుంది. ఈ మధ్య కాలంలోనే కొత్తగా రిలీజ్ అయిన Clavis నుంచి EV వర్షన్ కూడా త్వరలో రానుంది. ముఖ్యంగా ఈ కారు మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 500 కిలోమీటర్లు ఒకసారి చార్జింగ్ చేస్తే ప్రయాణిస్తుంది. Hyundai Creta ఈవీకి చెందిన బ్యాటరీ ప్యాక్ ఇందులో వాడే అవకాశం ఉంది.

Mahindra XUV 3X0 EV -

మహేంద్ర మోటార్స్ నుంచి వస్తున్న ఈ కారు ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో ఒక చక్కటి ఫ్యామిలీ కార్ అని చెప్పవచ్చు. ఈ కారు సామర్థ్యం విషయానికి వచ్చినట్లయితే 34.5kWh బ్యాటరీ, ఫుల్ ఛార్జ్‌లో 456 కిలోమీటర్ల రేంజ్.ఇందులో చూడవచ్చు. 6 ఎయిర్‌బ్యాగ్స్ తో పాటు ఇతర సేఫ్టీ ఫీచర్లను ఇందులో చూడవచ్చు.

Tata Sierra EV –

ఈ ఏడాది ఆగస్టులో విడుదల అవుతున్న ఈ కారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్లో చక్కటి మోడల్ అని చెప్పవచ్చు. ఈ కారు ముఖ్యంగా ఒకసారి చార్జ్ చేసినట్లయితే దాదాపు 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 కెమెరా, ESC, ADAS లాంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో చూడవచ్చు.

Maruti Suzuki e-Vitara –

ఏడాది లాంచ్ అయ్యే ఈ కారు 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్‌లతో మార్కెట్లకు ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చే ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 500km వరకు మైలేజీని ఇందులో చూడవచ్చు. 7 ఎయిర్‌బ్యాగ్స్, 360 కెమెరా, ABS, EBD, Level–2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీని ధర రూ. 17–18 లక్షల వరకు ఉండే అవకాశం.

Next Story