- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది... అదిరిపోయే ఫీచర్స్ ఇవే !
హోండా 0 ఆల్ఫా పేరుతో ఆవిష్కరణ చేసింది హోండా. 2027 సంవత్సరంలో ఇండియాలో

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే, కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నాయి. హోండా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ SUV కాన్సెప్టు వాహనాన్ని తీసుకు వస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ కారును హోండా 0 ఆల్ఫా పేరుతో ఆవిష్కరణ చేసింది హోండా. 2027 సంవత్సరంలో ఇండియాలో కూడా ఈ SUV లాంచ్ కాబోతుంది. ఈ వాహనాలు మన ఇండియాలోనే తయారవుతున్నాయి. భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ వాహనాలను తయారు చేస్తున్నారు.
ఈ కారు ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 19 అంగుళాల షార్ప్ డిజైన్ అల్లాయ్ వీల్స్ అందిస్తున్నారు. హై గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇస్తున్నారు. ఈ కారులో రెండు బ్యాటరీ బ్యాక్ ఆప్షన్స్ కూడా అందిస్తారు. 65kwh తో పాటు 75 kwh రెండిటిని కూడా అందిస్తున్నారు. Lfp టెక్నాలజీతో ఈ రెండు బ్యాటరీలు నడుస్తాయి. అయితే ఈ SUV కారు ధర 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. అయితే, ఈ బైక్ మైలేజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాగా హోండా 0 ఆల్ఫా పేరుతో వస్తున్న ఎస్ యూవీ...ఎంజీ జడ్ఎస్, హుందాయ్ క్రెటా, టాటా కర్వ్, మహీంద్రా బీఈ 6, మారుతి ఈ విటారా లాంటి వాహనాలకు పోటీని ఇవ్వనుంది.






