- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోండా ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ బైకులన్నీ ఇప్పుడు తక్కువ ధరకే!
హోండా మోటార్స్ బైక్ ప్రియులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. హోండాలోని 350 సీసీ కంటే తక్కవ ఉండే వాహనాల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 350 సీసీ బైకులు, స్కూటర్లపై జీఎస్టీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో కంపెనీ సైతం ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: హోండా మోటార్స్ బైక్ ప్రియులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. హోండాలోని 350 సీసీ కంటే తక్కవ ఉండే వాహనాల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 350 సీసీ బైకులు, స్కూటర్లపై జీఎస్టీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో కంపెనీ సైతం ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. కస్టమర్ ఎంపిక చేసుకున్న బైకును బట్టి మోడల్ పై రూ.18,887 వరకు తగ్గింపు ఉంటుందని సంస్థ పేర్కొంది. దీంతో డియో, యాక్టివా స్కూటీలు మరియు షైన్ యూనికార్న్ తో పాటు పలు పాపులర్ హోండా బైకులు ఇప్పుడు గతం కంటే తక్కువ ధరకే రానున్నాయి.
అంతేకాకుండా సవరించిన కొత్త ధరలు కూడా వెంటనే అమలులోకి రానున్నాయి. ఈ సందర్భంగా హోండా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేశ్ మాథూర్ మాట్లాడుతూ... ప్రభుత్వం జీఎస్టీని సవరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆర్థికాభివృద్ధికి ఈ నిర్ణయం ఊతమిస్తుందన్నారు. ఈ ఆలోచనతో వాహనాలు మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 40 శాతం జీఎస్టీ స్లాబ్ పరిధిలోకి వచ్చే కొన్ని వాహనాలపై ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.






